గుడుపల్లెలో ఫుట్‌వేర్‌ కంపెనీ | - | Sakshi
Sakshi News home page

గుడుపల్లెలో ఫుట్‌వేర్‌ కంపెనీ

Jul 3 2026 1:16 AM | Updated on Jul 3 2026 1:16 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో దక్షిణ కొరియాకు చెందిన హ్వాసెంగ్‌ ఫుట్‌వేర్‌ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.898 కోట్ల పెట్టుబడితో నాన్‌ లెదర్‌ ఫుట్‌వేర్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానుందని, మూడు దశల్లో అమలు చేస్తారని వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

11న లోక్‌ అదాలత్‌

చిత్తూరు అర్బన్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్‌ అదాల త్‌ నిర్వహించనున్న ట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. రాజీ చేసుకోదగ్గ కేసులను లోక్‌ పదాల తో పరిష్కరించుకోవాలని సూచించారు. కక్షిదారులు, న్యాయవాదులు పోలీసు శాఖ, బీమా ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగాల అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 కోర్టుల్లో ప్రత్యేక అదాలత్‌ బెంచులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

విద్యాశాఖ

సూపరింటెండెంట్ల బదిలీ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లను బదిలీ చేశా రు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో కార్వేటినగరం ప్రభుత్వ డైట్‌ కళాశాల సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కృపావతిని అన్నమయ్య జిల్లా మదనపల్లి డీఈవో కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమె స్థానంలో వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఎస్‌ఎస్‌ఏ సూపరింటెండెంట్‌ ప్రేమకుమారిని నియమించారు.

నేడు పీజీటీ పోస్టుల

భర్తీకి కౌన్సెలింగ్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : హైస్కూల్‌ ప్లస్‌లలో ఖాళీ గా ఉన్న పీజీటీ పోస్టుల భర్తీకి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌ కోసం స్కూ ల్‌ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితా సిద్ధమైందని పేర్కొన్నారు. అందులో అభ్యంతరాలుంటే ఉదయం 11 గంటలలోగా తగిన ఆధారాల తో తెలపాలని పేర్కొన్నారు. పీజీటీ పోస్టుల కోసం 250కి పైగా దరఖాస్తులను అధికారులు గురువారం పరిశీలించినట్టు తెలిపారు.

13 లోపు ఫీజు చెల్లించాలి

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సులకు సంబంధించి సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల చివరిలో నిర్వహించడం జరు గుతుందని, విద్యార్థులు పరీక్ష ఫీజును ఈ నెల 13వ తేదీ లోపు చెల్లించాలని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేన్స్‌ డాక్టర్‌ రాజామాణిక్యం తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని, విద్యార్థులు ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement