ప్రాణదాన పథకానికి 261 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ప్రాణదాన పథకానికి 261 మంది ఎంపిక

Jul 3 2026 1:16 AM | Updated on Jul 3 2026 1:16 AM

తిరుపతి తుడా: టీటీడీ ప్రాణదాన పథకం కింద స్విమ్స్‌లో పేదరోగులకు ఉచిత శస్త్ర చికిత్సల కోసం 261 మంది రోగులను ఎంపిక చేసినట్లు స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌ తెలిపారు. గురువారం స్విమ్స్‌లో డైరెక్టర్‌ అధ్యక్షతన జరిగిన ఎంపిక ప్రక్రియలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ కోటిరెడ్డి, బర్డ్‌ హాస్పిటల్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ రామూర్తి, టీటీడీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కుసుమకుమారి, రుయా హాస్పిటల్‌ డాక్టర్‌ సుబ్బలక్ష్మి, మెటర్నటీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. ఇందులో ఎనిమిది మంది కార్డియాలజీ, 25 మంది కార్డియో థోరాసిక్‌, 14 మంది జనరల్‌ సర్జరీ, 16 మంది, మెడిసన్‌, 76 మంది నెఫ్రాలజీ, 9 మంది న్యూరాలజీ, 45 మంది న్యూరో సర్జరీ, నలుగురు గైనకాలజీ, ఒకరు రేడియాలజీ, నలుగురు రేడియేషన్‌ అంకాలజీ, 48 మంది గ్యాస్ట్రో ఎంట్రాలజీ, 10 మంది సర్జికల్‌ అంకాలజీ, ఒకరు యురాలజీ రోగులు ఉన్నట్టు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement