హైస్కూల్ ప్లస్ పోస్టుల నియామకాల్లో గందరగోళం
మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంలకు అన్యాయం
జూనియర్లను నియమిస్తున్న వైనం
న్యాయం చేయాలంటూ అయ్యోర్ల ధర్నా
2025 బదిలీల్లో అధికారులు స్వయంగా ఫోన్లు చేశారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు పీజీ టీ పోస్టుల భర్తీలో మీరు ప్రైమరీ స్కూల్‌లో ఉన్నారు.. మీకు అర్హత లేదని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి మా పనితీరును మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు. అధికారులు నిబంధనల సాకుతో అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం చేసి తీరాల్సిందే.
– శ్రీనివాసులు, పీఆర్‌టీయూ స్టేట్ అడిషనల్ సెక్రెటరీ
అర్హతలున్నా వివక్ష చూపడం ఎంతవరకు న్యాయం?
పీజీటీగా అన్ని రకాల అర్హతులున్నా మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంల సాకుతో వివక్ష చూపడం ఎంతవరకు న్యాయం. నిబంధనల ప్రకారం సాధారణ హైస్కూళ్లలో ఉండే స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం కల్పించారు. మేము కూడా స్కూల్ అసిస్టెంట్ కేడర్‌కు చెందిన వారమే. మాకు అన్యాయం చేయడం తగదు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు న్యాయం చేయాలి.
– లత, మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం
ప్రైమరీ స్కూల్లో ఉన్నామనే ఆపేస్తారా?
ఉన్నత పాఠశాలల్లో ప్లస్ టూ స్థాయి విద్యను బలోపేతం చేసేందుకు హైస్కూల్ ప్లస్ విధానాన్ని తీసుకువచ్చారు. నేను పీజీ పూర్తి చేసి పీజీటీ పోస్టుకు అన్ని అర్హతలు సాధించాను. నా సీనియారిటీ కూడా జిల్లా స్థాయి సబ్జెక్ట్ లిస్టులోనే ఉంది. అధికారుల బలవంతం వల్ల సర్దుబాటు నిమిత్తం మోడల్ ప్రైమరీ స్కూల్స్‌కు హెచ్‌ఎంగా వచ్చాను. ఇప్పుడు సాంకేతిక కారణాన్ని చూపి అర్హత లేదని చెబుతున్నారు. ఇది ఎంత వరకు న్యాయం.
– బత్తిన నాయుడు, మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం


