అనర్హులంటున్నారు..
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హైస్కూల్ ప్లస్ పాఠశాలలు 50 ఉన్నాయి. వీటిలో పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుల భర్తీకి విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పోస్టుల నియామకాల్లో అన్ని రకాల విద్యార్హతలు, సుదీర్ఘ సర్వీస్ ఉన్నప్పటికీ మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెచ్‌ఎంలను అనర్హులుగా అధికారులు ప్రకటిస్తున్నారు. సీనియర్ స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో ఉన్న తమపై వివక్ష చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బలవంతపు బదిలీలే శాపం
2025లో బదిలీల్లో స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్లు పూర్తయిన వారిని, రేషనలైజేషన్‌లో పోస్టులు కోల్పోయిన వారు మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం పోస్టులను ఎంపిక చేసుకునేలా అధికారులు ఒత్తిడి తెచ్చారు. జిల్లా స్థాయిలో సీనియారిటీ జాబితాను పరిశీలిస్తే మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంలుగా పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను వారి పాత సబ్జెక్టుల సీనియారిటీ జాబితాలోనే కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రాథమిక పాఠశాలల బాధ్యతలను మోయాల్సి వస్తోంది.


