యూపీఎస్‌సీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి సత్తా | - | Sakshi
Sakshi News home page

యూపీఎస్‌సీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి సత్తా

Jul 3 2026 1:16 AM | Updated on Jul 3 2026 1:16 AM

పలమనేరు: ఇటీవల యూపీఎస్‌సీ చేపట్టిన నియామకాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సోమల మండలం రాశెట్టివారిపల్లికి చెందిన రాశెట్టి సదాశివయ్య, పార్వతమ్మ దంపతుల కుమారుడు రాశెట్టి మంజునాథ్‌ సత్తా చాటాడు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలో సహాయ సంచాలకుడిగా ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయనకు గురువారం నియామపక పత్రం అందింది. మంజునాథ్‌ యూపీఎస్‌సీ మెయిన్స్‌లో విజయం సాధించి పలుమార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి కొన్ని మార్కుల్లో ఉద్యోగాలను పొందలేకపోయారు. గతేదాడి కూడా ఇంటర్వ్యూలో ఒక మార్కుతో అవకాశాన్ని కోల్పోయాడు. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఇతనికి కేంద్ర ప్రభుత్వ గ్రూప్‌–ఏ గెజిటెడ్‌ హోదా కలిగిన పోస్టు దక్కింది. దీంతో కుటుంభ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

కుంగిపోకుండా ప్రయత్నించాలి

యూపీఎస్‌సీ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూలో ఓడాను. మొక్కవోని దీక్షతో మళ్లీ ప్రయత్నించాను. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేటి యువత పరాజయాలకు కుంగిపోకుండా ప్రయత్నిస్తే విజయం దక్కుతుంది.

– రాంశెట్టి మంజునాథ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement