● స్వార్థ రాజకీయాలకు, వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉండండి ● కూటమి ఉచ్చులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి | - | Sakshi
Sakshi News home page

● స్వార్థ రాజకీయాలకు, వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉండండి ● కూటమి ఉచ్చులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

Jul 2 2026 2:11 AM | Updated on Jul 2 2026 2:11 AM

● స్వార్థ రాజకీయాలకు, వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉండండి ● కూటమి ఉచ్చులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

దళిత గ్రామాల్లో అలజడులు సృష్టించొద్దు

శ్రీరంగరాజుపురం: కూటమి ప్రభుత్వం దళిత గ్రామాల్లో అలజడులు సృష్టించాలని చూస్తోందని, వారి స్వార్థ రాజకీయాలకు దళితులు బలి కావొద్దని, హక్కుల సాధన కోసం కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా పోరాడాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. ఆయన బుధవారం పుత్తూరులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు పెరిగాయన్నా రు. ప్రశాంతంగా ఉన్న దళిత గ్రామాల్లో అధికార పక్ష నేతలు అలజడులు సృష్టిస్తూ, దళితుల మధ్య వైషమ్యాలు రేపుతున్నారని మండిపడ్డారు.

జగనన్న పాలనలోనే సామాజిక న్యాయం

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడిచిన ఏకై క నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని నారాయణస్వామి కొనియాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కులం, మతం, వర్గం, రాజకీయం తారతమ్యం లేకుండా ప్రతి పేదవాడి అభివృద్ధి కోసం జగనన్న కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం పేదలను పూర్తిగా విస్మరించి ఉన్నత వర్గాలు, బినామీల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న దళిత యువత.. కూటమి రాజకీయ నేతల ఉచ్చులో పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగడం బాధాకరమన్నారు. కేసులు పెట్టుకుని ఆర్థికంగా, జీవితపరంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్‌ రామ్‌, మదర్‌ థెరిసా, సావిత్రీబాయి పూలే ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. వ్యక్తిగత ద్వేషాలను పక్కనపెట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement