రైతులంటే చంద్రబాబుకి ఇష్టం లేదు! | - | Sakshi
Sakshi News home page

రైతులంటే చంద్రబాబుకి ఇష్టం లేదు!

Jul 1 2026 12:28 AM | Updated on Jul 1 2026 12:28 AM

● పక్క రాష్ట్రంలో కిలో మామిడి రూ.17 ● ఇక్కడి ధరలు చూస్తే బాధేస్తోంది ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ● అధికారులకు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ ఆదేశాలు

● పక్క రాష్ట్రంలో కిలో మామిడి రూ.17 ● ఇక్కడి ధరలు చూస్తే బాధేస్తోంది ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు నాయుడుకి రైతులంటే ఇష్టం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక్క కేంద్ర మంత్రి ఉన్నా అక్కడి మామిడికి కిలో రూ.17లు మద్దతు ధర ఉందని గుర్తుచేశారు. ఇక్కడేమో కేవలం రూ.4 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీ నగర్‌లోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మామిడి రైతులు అనేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ము ఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువ శాతం మామిడి రైతులే ఉన్నారన్నారు. ప్రస్తు తం ఉన్న ధరలకు కూలీలకు కూడా రావని తేల్చిచెప్పారు. కనీస ధర అయినా ఇస్తే రైతులు నష్టాల నుంచి బయటపడుతారని తెలియజేశారు. రాష్ట్రంలో పాలన లేదు, కేవలం కేసులు పెట్టడం, టార్చర్‌ చేయడం, గోర్లు పీకేయడం, చంపేయడం, బూడిద కూడా దొరక్కుండా చేయడం జరుగుతోందని ఆరోపించారు.

సీఎం పర్యటనకు

పకడ్బందీ ఏర్పాట్లు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో జూలై 3 నుంచి 5 వ తేదీ వరకు కుప్పం పర్యటనకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో పలు అభి వృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రజాసభలు, రైతులతో ముఖా ముఖి, పారిశ్రామికవేత్తలతో చర్చలు, కీలక ఎంఓయూలు ఉండనున్నాయని తెలిపారు. ప్రతి శాఖ తమకు కేటాయించిన బాధ్యతలను అత్యంత బాధ్యతాయుతంగా, సమయపాలనతో పూర్తిచేయాలని స్పష్టం చేశారు. సభా ప్రాంగణాల వద్ద తాగునీరు, అల్పాహారం, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. వీటితో పాటు ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌, భద్రత, వేదికల నిర్మాణం, మైక్‌, విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఏకరీతిలో రూపొందించాలని, పారిశ్రామిక ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. సీఎం పర్యటనకు ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించినట్లు తెలిపా రు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, డీఆర్‌వో మోహన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement