19 మంది ఆస్పత్రిపాలు
ఐదుగురికి వాంతులు
విద్యార్థులను పరామర్శించిన
డీవైఈవో
కార్వేటినగరం: వింతపురుగు కాటుతో విద్యార్థులకు శరీరంపై మంటలు ఏర్పడిన సంఘటన మండల పరిధిలోని డీఎం పురం ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేర కు వివరాలిలా.. డీఎంపురం ప్రభుత్వ ఉన్నత పాఠ శాల ఆవరణంలో ఉదయం విద్యార్థులు కొంతమంది పాఠశాల ఆవరణలో చెట్లకింద ఆడుకుంటూ ఉన్న సమయంలో ఓ విద్యార్థిని వింత పురుగు కాటువేసింది. దీంతో విద్యార్థి మంటలు తట్టుకోలేక కేకలు వేయడంతో అదే పాఠశాలకు చెందిన విద్యార్థులు అక్కడికి చేరుకుని పరిశీలించే లోపు వారు కూడా పురుగు కాటుకు గురై మంటలకు తట్టుకోలేక తల్లడిల్లిపోయారు. సమయానికి పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు 108 వాహనానికి సమాచా రం అందించి పురుగు కాటుకు గురైన 19 మంది విద్యార్థులను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద చేరుకుని మంటలకు తల్లడిల్లిపోతున్న తమ పిల్లలను చూసి బోరున విలపించారు. ఇదే క్రమంలో 5 మంది విద్యార్థులకు వాంతులు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం కలుగుతుందని మరింత భయానికి గురయ్యారు. దీంతో పుత్తూ రు ప్రభుత్వ ఆస్పత్రికి చెంది వైద్య సిబ్బంది హుటాహుటిన విద్యార్థులకు చికిత్స అందించడంతో విద్యార్థులకు శరీరంపై నవ్వలు తగ్గడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు ఊపి రి పీల్చుకున్నారు.
విద్యార్థులను పరామర్శించిన డీవైఈవో
డీఎం పురం ఉన్నత పాఠశాల విద్యార్థులు వింత పురుగు కాటుకు గురై పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుకున్న పుత్తూరు డీవైఈవో మహేశ్వరరావు, కార్వేటినగరం ఎంఈవోలు విజయకుమార్, మనోజ్‌కుమార్ ఆస్ప త్రికి చేరుకుని వైద్య సిబ్బందితో మాట్లాడి విద్యార్థుల పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ధైర్యం చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని భరోసా కల్పించారు.
విద్యార్థులను హేళన చేసిన ఆరోగ్య సిబ్బంది
వింత పురుగు కాటుకు గురై విద్యార్థులు మంటలు తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే కత్తెరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఓ ఆరోగ్య సిబ్బంది పిల్లలు పాఠశాలను ఎగరగొట్టడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నట్లు హేళన చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది వారిపై కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైద్యాధికారులు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


