పూతలపట్టు(యాదమరి): సాంఘిక సంక్షేమ శాఖలో 35 సంవత్సరాల పాటు సేవలందించిన ఒక ఆదర్శ అధికారికి ఉన్నత గుర్తింపు లభించింది. మండల పరిధిలోని పి.కొత్తకోట సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న జయచంద్రారెడ్డికి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారిగా పదోన్నతి దక్కింది. తిరుపతి కేంద్రంగా బుధవారం ఆయన ఈ నూతన భాద్యతలు స్వీకరించనున్నారు. పదోన్న తి రావడం పట్ల వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసా రు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డిని వసతి గృహ సిబ్బంది జ్ఞానశేఖర్, ప్రసాద్, చిరంజీవి తదితరులు ఘనంగా సత్కరించారు.
జిల్లాలో 97 శాతం
పల్స్ పోలియో నమోదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లావ్యాప్తంగా మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీ య పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రభు త్వం నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటివరకు 1,72,523 మందికి పోలియో చుక్కలు వేసిన ట్లు ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా జిల్లాలో 97.05 శాతం ప్రగతి సాధించామనివివరించారు.
దివ్యాంగ బాలికల
వసతి గృహంలో అడ్మిషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఉన్న దివ్యాంగ బాలికల వసతి గృహంలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విభి న్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపా రు. మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. 3 వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న శారీరక విభిన్న ప్రతిభావంతులు, బధిరులు, అంధులైన బాలికలకు బాలికల వసతి గృహంలో అడ్మిషన్లు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థినులందరికీ ఉచితంగా రుచికరమైన, పోషకాలతో భోజనం అందిస్తారని తెలిపారు. వసతిగృహం నుంచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఉచిత వ్యాన్ సౌకర్యం ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థినికి సంవత్సరానికి 4 జతల దుస్తులు, దుప్పట్లు, మంచం, బెడ్ సదుపాయంతో పాటు, కాస్మొటిక్స్ ఖర్చుల నిమిత్తం నెలకు రూ.250/– నగదు చెల్లిస్తారని తెలి పారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం నర్స్‌తో వైద్య సదుపాయం, సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉందన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు 9440990698, 08572–296506 నెంబర్లలో సంప్రదించాలని ఏడీ కోరారు.
హెల్పర్లపై పోలీసుల డేగ కన్ను
– ఎంసీ రవి కిడ్నాప్ కేసులో
స్థానికులపై విచారణ
పలమనేరు: జిల్లాలో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ ట్రేడర్ ఎంసీ రవి కిడ్నాప్ కేసులో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠాకు స్థానికంగా సహకరించదెవరనే కీలక సమాచారంపై పలమనేరు పోలీసులు డేగకన్ను పెట్టినట్టు తెలిసింది. గతనెల ఏడున రవిని కేరళ పోలీసుల వేషంలో అరెస్ట్‌చేసి బేడిలేసి అతని నుంచి కోటి నగదు, కోటి విలువైన బంగారాన్ని దోచుకెళ్ళిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేయగా 15మందిని పట్టుకోవాల్సి ఉంది. అయితే ఈ కేసులో కీలక నిందితులైన మహేష్ నాయుడు, భానుప్రకాష్‌లకు గతంలో రవితో పాత కక్షలున్న కొందరు కలిసి ఈ కిడ్నాప్ స్కెచ్ వేసినట్టు తెలి సింది. దీంతో పోలీసులు ఓ వ్యక్తిని తాజాగా విచారించినట్టు సమాచారం. మొత్తం మీద అంతర్రాష్ట్ర కిడ్నాపర్ల కేసులో కొందరు గంగవరం ప్రాంతవాసుల మెడకు చుట్టుకునేలా ఉందనే మాట వినిపిస్తోంది. ఆమేరకు ఇందులో పోలీసులకు అవసరమైన కీలక విషయాలను బాధితుడు రవి సైతం సేకరించినట్టు తెలిసింది. వీటని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చినట్టు సమాచారం.


