చిత్తూరు అర్బన్ : జిల్లాలో జూన్ నెలలో పదవీ విరమణ పొందిన తొమ్మిది మంది పోలీసు అధికారులకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ అతిథి గృహంలో మంగళవారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు నాన్ కేడెర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర రాజు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్, అడిషనల్ ఎస్పీ ఎస్.షాను తదితరులు పదవ విరమణ పొందిన అధికారులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ఉమామహేశ్వర రావు, ఆర్‌ఐలు సుధాకర్, వీరేశ్, ఏఓ నాగభూషనమ్మ, పోలీస్ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


