వి.కోట: స్థానిక విలేకరి జగన్‌మోహన్ రెడ్డి హత్య కేసులో కేసులో హత్య చేసిన తమీమ్, సుభాన్, అందుకు ప్రేరేపించి, సహకరించిన బీఎస్పీ నేత శ్రీనివాస్ ముగ్గురు ముద్దాయిలుగా నేరం రుజువు కావడంతో ప్రసుత్తం మదనపల్లె జైల్లో ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. కాగా ఈ కేసులో మరో విలేకరిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ సోమశేఖర్‌రెడ్డి తో కలసి డీఎస్పీ మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ విలేకరి జగన్‌మోహన్ రెడ్డి హత్య కేసు విచారణలో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న వారితో పాటు విలేకరిగా విధులు నిర్వహిస్తున్న దొరస్వామి కూడా జగన్ హత్యకు పరోక్షంగా సహకరించిన్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. మంగళవారం దొరస్వామిని సైతం అరెస్ట్ చేసినట్టు చెప్పారు. దొరస్వామి సెటిల్‌మెంట్లకు జగన్ అడ్డువస్తున్నాడని భావించి హత్యకు సహకారం అందించినట్టు వివరించారు.


