– 8లో
మామిడి రైతులకు ఇస్తామన్న ప్రోత్సాహక నిధి గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. మార్గదర్శకాలు విడుదల చేయలేదు.
దాచాలంటే దాగవులే !
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మామిడికి గిట్టుబాటు ధరతోపాటు.. అన్‌లోడింగ్.. రైతు సమస్యల పరిష్కా రం కోసం వైఎస్సార్‌సీపీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది. ఊహించని ఈ పరిణామంతో చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది. కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు సోమవారం ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని హడావుడి చేశారు. ట్రాక్టర్లు రోడ్లపై క్యూలో ఉండడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ధర్నా చేపట్టే సమయానికి గుజ్జు పరిశ్రమల వద్ద ఒక్క ట్రాక్టర్ కూడా ఉండకూడదని ఆదేశించారు. అందులో భాగంగా గంగాధరనెల్లూరు పరిధిలోని జైన్ ఫ్యాక్టరీ వద్ద బారులు తీరిన మామిడి ట్రాక్టర్లను చెట్లు, పొదలు, నివాసాల మాటుకు తరలించే పనిలో పడ్డారు.
నానాతంటాలు
గత కొద్ది రోజులుగా గుజ్జు పరిశ్రమల వద్ద మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నోరెత్తకుండా ఉండేందుకు కూటమి నేతలు నానా తంటాలు పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ధర్నాలో పాల్గొనకుండా ఉంటే.. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రోడ్డుపై ట్రాక్టర్లు ఉన్నా.. రైతులు ఎవ్వరూ కనిపించకూడదని చెప్పి వారిని మరోచోటుకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.


