ఆలకించి దయచూపండయ్యా! | - | Sakshi
Sakshi News home page

ఆలకించి దయచూపండయ్యా!

Jun 30 2026 2:35 AM | Updated on Jun 30 2026 2:35 AM

పీజీఆర్‌ఎస్‌కు 231 అర్జీలు

అత్యధికంగా రెవెన్యూ శాఖకు 188 అర్జీలు

పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు

అర్జీలు స్వీకరించిన జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, ట్రైనీ కలెక్టర్‌ వెంకటేష్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రతి సోమవారమూ వస్తున్నా సమస్య లు పరిష్కారం కావడం లేదు. మీరైనా దయచూపండయ్యా అని అర్జీదారులు వేడుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అర్జీలు అందజేశారు. జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూమి, సర్వే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో వినతులను చెక్‌ చేసుకుంటూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం అర్జీలు 231 నమోదు కా గా అందులో అత్యధికంగా రెవెన్యూ శాఖ అర్జీలే 188 ఉండడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ వెంకటేశ్‌, డీఆర్వో మోహన్‌కుమార్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3 లక్షల మోసం

తవణంపల్లె మండలం ముట్టుకూరుకు చెందిన వెంకటేష్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి జేసీని ఆశ్రయించారు. మండలంలోని ఎగువమత్యం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా డబ్బులు ఇవ్వక, ఉద్యోగం రాక తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని జేసీ పోలీసు శాఖను ఆదేశించారు.

జేసీకి సమస్యలు మొరపెట్టుకుంటున్న అర్జీదారులు

న్యాయం చేయాలని కోరుతున్న బాధిత దివ్యాంగ అర్జీదారుడు వెంకటేష్‌

ప్రభుత్వ భూమిగా నమోదు

జీడీనెల్లూరు మండలం అగరమంగళం గ్రామానికి చెందిన సిద్ధయ్యమూర్తి జేసీకి తన అన్యాయాన్ని వివరిస్తూ వినతి పత్రం ఇచ్చారు. తన తల్లి నాగమ్మ పేరిట ఉన్న వ్యవసా య పట్టా భూమి ఉందన్నారు. గ్రా మంలో జరిగిన రీసర్వే అనంతరం ఇచ్చిన పాసు పుస్తకంలో ప్రభుత్వ భూమిగా నమోదైందని తెలిపారు. దీంతో తమకు అందాల్సిన అన్నదాత సుఖీభవ పథకం అందడం లేదన్నారు. పరిశీలించి న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement