బంగారుపాళెం : మండలంలోని బిఎల్ కండ్రిగ వద్ద సోమవారం సాయంత్రం పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసిట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బిఎల్ కండ్రిగ అటవీ సరిహద్దు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్‌ఐ ప్రసాద్, సిబ్బంది అక్కడికి చేరుకున్నారని తెలిపారు. డ్రోన్‌తో పేకాట ఆడుతున్న ప్రదేశాన్ని గుర్తించి దాడి చేసినట్ట పేర్కొన్నారు. పేకాట ఆడుతున్న పది మందిలో ముగ్గురు పరారయ్యారని, ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. వారి నుంచి రూ.32 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు మొగిలి వెంకటగిరికి చెందిన పయని, రాగిమానుపెంటకు చెందిన నాగరాజు, డిల్లీప్రసాద్, ఎర్రయ్య, పట్టాభి, బంగారుపాళెం దళితవాడకు చెందిన రాజ శేఖర్, పుంగనూరు మండలం శాంతినగర్‌కు చెందిన ఆనంద్‌గా గుర్తించామన్నారు. రాగిమానుపెంటకు చెందిన దాము, కోలావూరుకు చెందిన జీవ, బెంగళూరుకు చెందిన భాగ్యరాజ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
బైక్ బోల్తాపడి యువకుడి మృతి
గుడిపాల : మండలంలో ని నంగమంగళం వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద సోమ వారం బైక్ బోల్తాపడి యువకుడు మృతిచెందా డు. ఎస్‌ఐ రామ్మోహ న్ కథనం మేరకు.. మందిక్రిష్ణాపురం దళితవాడకు చెందిన పాల్‌జాన్సన్(23) ఇంటికి కూరగాయలు తీసుకురావడాని కి బొమ్మసముద్రం వెళ్లి తిరిగి ప్రయాణమ య్యాడు. ఈ క్రమంలో నంగమంగళం వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొనడంతో కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానకులు వెంటనే 108 అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉరివేసుకుని బాలిక ఆత్మహత్య
గంగవరం: మండలంలోని బండమీద జరావారిపల్లిలో ఆదివారం ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. బండమీద జరావారిపల్లికి చెందిన పద్మమ్మ కుమార్తె శిరీష(14) కీలపట్ల జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. ఉదయం తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా బాలిక ఇంటి వద్దనే ఉంది. ఏమి జరిగిందో కాని సాయంత్రం తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇంటి పక్కన ఉంటున్న మరో కుటుంబం వేధింపుల వల్లే తమ బిడ్డ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లి బోరున విలపించింది. వారిపై చర్యలు తీసుకోవాలని పోలిసులను వేడుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 91,793 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,221 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.38 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారు సకాలంలో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉండగాటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూ లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
గరుడ వాహనంపై
దివ్యదర్శనం
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. సాయంత్రం పద్మావతి అమ్మవారు తెప్పపై కొలువుదీరి పుష్కరిణిలో ఏడు పర్యాయాలు విహరించి భక్తులను ఆశీర్వదించారు. రాత్రి అమ్మవారికి గరుడ వాహన సేవను కనుల పండువగా చేపట్టారు. తెప్పోత్సవం అనంతరం అమ్మవారిని గంగుండ్ర మండపానికి తీసుకొచ్చి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారు గరు డ వాహనంపై ఆశీనులై తిరువీధుల్లో ఊరేగు తూ భక్తులను ఆశీర్వదించారు. జేఈవో శరత్, ఆలయ డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, ముని చెంగల్రాయులు, సురేష్ పాల్గొన్నారు.
ఆర్జిత సేవలు పునఃప్రారంభం
అమ్మవారి తెప్పోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. మంగళవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభిస్తున్నట్టు ఆలయ డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ తెలిపారు.


