చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని వివరించారు.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యా దులు స్వీకరిస్తామని తెలిపారు. వాటిని సంబంధిత అధికారులకు బట్వాడా చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారు లు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వినాయకస్వామి సన్నిథిలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ
కాణిపాకం: రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ రమాదేవి కుటుంబ సమేతంగా ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఈవో పెంచల కిషోర్ స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటా న్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, సూపరింటెండెంట్ కోదండపాణి, కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు, చిత్తూరు పోలీస్ ఇంటెలిజెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు పోలీసు గ్రీవెన్స్‌డే
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.


