యాదమరి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే పేద రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవ లు అందించడంలో అలసత్వం వహించరాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగ శశిభూషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం మాదిరెడ్డిపల్లి పీహెచ్‌సీ పరిధిలోని 184 గొల్లపల్లి, 12కమ్మపల్లి, దళవాయిపల్లిలో పల్స్ పోలి యో కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మాదిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, సిబ్బంది హాజరు పట్టిక, సంజీవిని అమలు తీరును పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్య సేవలను మెరుగుపరచాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యాధికారి వరప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం.. బీఎల్‌ఓ సస్పెన్షన్
చంద్రగిరి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) విధుల్లో నిర్లక్ష్యం వహించిన బీఎల్‌ఓను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తిరుచానూ రులోని 294 పోలింగ్ కేంద్రం వద్ద ఆయన క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఆ సమయంలో బీఎల్ ఓ మునిరాజ రెడ్డి నిర్లక్ష్యాన్ని గుర్తించారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఓటరు ఇంటికి వెళ్లి పంపిణీ చేయకుండా ఎస్‌ఐఆర్ విధులతో సంబంధం లేని వ్యక్తుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు గమనించారు. దీంతో బీఎల్‌ఓ మునిరాజరెడ్డిని సస్పెండ్ చేశారు.


