టాప్‌వర్కింగ్‌లో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. తోతాపురి చెట్ల నుంచి నాణ్యమైన టేబుల్ వైరెటీలను ఉత్పత్తి చేసుకోవచ్చు. పాతతోటల స్థానంలో ఏజ్ గ్యాప్ లేకుండా త్వరగా కొత్త పంట వస్తుంది. భారీగా పెరిగిన చెట్లు కట్ చేసి చిన్నగా కోతలకు అనుకూలమవుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ధర కలిగిన రకాలను పండించుకోవచ్చు. దీనిపై ఏవైనా సలహాల కోసం సంబందిత హార్టికల్చర్ అధికారులను సంప్రదించాలి.
– కోటేశ్వరావు, సైంటిస్ట్,
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, కుప్పం
గ్రాఫ్టింగ్ ద్వారా
మంచి రకాలను పండిస్తున్నాను
నాకు 30 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఇందులో తోతాపురి చెట్లలో గ్రాఫ్టింగ్ ద్వారా ఖాదర్, బేనీషా మొక్కలను అంటుకట్టించాను. గత ఐదేళ్ల నుంచి తోతాపురి చెట్లలో మేలైన రకాలను పండిస్తున్నా. వీటికి మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. గతంలో తోతాపురి రకం మామిడి దిగుబడి వచ్చినా ధర వచ్చేది కాదు. కాయలను అమ్ముకునేందుకు తిప్పలు పడేవాడిని. ఇప్పుడు ఆ శ్రమ లేదు.
– గాలి సుబ్రమణ్యం నాయుడు, రామాపురం


