స్టేట్‌ షూటింగ్‌ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు | - | Sakshi
Sakshi News home page

స్టేట్‌ షూటింగ్‌ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు

Jun 29 2026 12:23 AM | Updated on Jun 29 2026 12:23 AM

కార్వేటినగరం: ఆంధ్రప్రదేశ్‌ షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌ స్మాల్‌బోర్‌ పిస్టల్‌, స్మార్ట్‌గన్‌ విభా గాల్లో కార్వేటినగరం ఆర్కేఎస్సార్‌ జూనియ ర్‌ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థి హితే ష్‌ రెండు స్వర్ణ పతకాలను కై వసం చేసుకున్న ట్టు ప్రిన్సిపాల్‌ స్వరూప తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 26వ తేదీ వర కు హైదరాబాద్‌లో స్టేట్‌ షూటింగ్‌ చాంపియన్‌ పోటీలు జరిగినట్టు తెలిపారు. ఇందులో తమ కళాశాల విద్యార్థి హితేష్‌ స్మాల్‌బోర్‌ పిస్టల్‌, స్మార్ట్‌ గన్‌ విభాగాల్లో ప్రతిభ చూపి రెండు స్వర్ణ పతకాలు సాధించాడన్నారు. విద్యార్థి హితేష్‌ను కళాశాల అధ్యాపకులు, గ్రామస్తులు అభినందించారు.

మామిడి కేజీకి రూ.6లు

గుడిపాల: మామిడి కేజీకి రూ.6 ధర ఇవ్వాల్సిందేనని తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎస్‌ఐ రామ్మోహన్‌ స్పష్టం చేశారు. వారు ఆదివారం టాసా ఫ్యాక్టరీ యజమానులతో మాట్లాడి బోర్డు పెట్టించారు. రెండు రోజులుగా టాసా జ్యూస్‌ ఫ్యాక్టరీ వద్ద కేజీ రూ.5, రూ.4 అని వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం కావడంతో ఫ్యాక్టరీని తహసీల్దార్‌, ఎస్‌ఐ తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు సూచించారు. టాసా ఫ్యాక్టరీ యాజమాన్యం మాట్లాడుతూ తాము కిలోకు రూ.6 ఇస్తామని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

లారీ ఢీకొని అన్నాచెల్లెలు మృతి

వి.కోట: మండలంలోని పేర్నంబుట్టు – వి.కోట జాతీయ రహదారిలోని మొదటి ఘాట్‌ లో ఆదివారం బైక్‌ను లారీ ఢీకొనడంతో అన్నాచెల్లెలు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. కార్ణాటక రాష్ట్రం కెజీఎఫ్‌ పట్టణంలోని పారాండ్లపల్లికి చెందిన శ్రీధర్‌ కుమారుడు బాలాజీ(22), అతని చెల్లెలు మహాశ్రీ(11) బైక్‌పై కేజీఎఫ్‌ నుంచి పెర్నంబట్టుకు బయలుదేరారు. పేర్నంబుట్టు – వి.కోట జాతీయ రహదారిలోని మొదటి ఘాట్‌లో పేర్నంబట్టు వైపు వెళుతున్న తమిళనాడుకు చెందిన లారీ వేగంగా వస్తూ ఢీకొంది. అన్నాచెల్లెలు లారీ చక్రాల కింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ నుజ్జునుజ్జు అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు.

మామిడి రైతులకు కర్ణాటక తరహా సాయం అందాలి

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: కర్ణాటకలో మామి డి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీడీపీఎస్‌ పథకాన్ని అమలుచేస్తూ కిలోకు రూ.17 చెల్లించడానికి ముందుకు వచ్చిందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి తెలిపారు. ఇక్కడ కూడా అలాగే చేయాలని పేర్కొన్నారు. ఇక్కడి ప్రభుత్వం మామిడికి గిట్టుబాటు ధర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత ఏడాది మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బంగారుపాలెం పర్యటన ఖరారు కావడంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.4 గుజ్జు ఫ్యాక్టరీల ద్వారా, మరో రూ.4లు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ దఫా రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొ ని రాష్ట్రంలో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద ప్రైస్‌ డెఫిషియన్సీ పేమెంట్‌ స్కీం (పీడీపీఎస్‌) అమలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు లేఖ రాశారని పేర్కొన్నారు. లేఖతో సరిపెట్టుకోకుండా కేంద్రాన్ని ఒప్పించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement