జర్నలిస్టు జగన్ కుటుంబానికి రూ.3.5 లక్షలు ఇచ్చాం వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఎన్.నాగరాజ్ టీడీపీ అబద్దాలపై కాణిపాకంలో సత్య ప్రమాణం
కాణిపాకం/వి.కోట: వి.కోటలో దారుణ హత్యకు గురైన జర్నలిస్టు జగన్‌మోహన్ రెడ్డి కుటుంబానికి వైఎస్సార్ సీపీ ప్రకటించిన రూ.3.5 లక్షల ఆర్థిక సహాయాన్ని పూర్తిగా అందించామని, ‘చెక్కు బౌన్స్ అయింది.. డబ్బులు ఇవ్వలేదు’ అంటూ టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ద మని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఎన్.నాగరాజ్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి సాక్షిగా సత్య ప్రమాణం చేశారు. టీడీపీ దుష్ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శవ రాజకీయాలు చేయడం ఒక్క టీడీపీకే సాధ్యమన్నారు. మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే దాన్నీ వక్రీకరించి దుష్ప్రచారం చేయడం టీడీపీ నైజమని ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులు చెక్కు కాకుండా నగదు ఇవ్వాలని కోరడంతో రూ.3.5 లక్షలు అందజేశామన్నారు. చెక్కు హామీ కోసం మాత్రమే ఇచ్చామని స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబం రాజకీయంగా తమ పార్టీకి చెందకపోయినా, మిత్రుడిగా భావించి ఆదుకున్నామని చెప్పారు. తాము చేసిన సాయాన్నే వక్రీకరించి మాజీ ఎమ్మెల్యే ఎన్.వెంకటే గౌడ, వైఎస్సా ర్ సీపీపై విషప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. జగన్‌మోహన్ రెడ్డి హత్య తర్వాత ప్రభుత్వం, ఇతరులు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం, సీఎం రిలీఫ్ ఫండ్, పిల్లల చదువులు, ఇతర ఆర్థిక సహా యం వంటి హామీలు ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మాపై బురద జల్లే యూట్యూబ్ ఛానళ్లు, టీడీపీ సోషల్ మీడియా..ఆ హామీలు ఎందుకు అమలు కాలేదో ప్రభుత్వాన్ని నిలదీయాలి‘ అని డిమాండ్ చేశారు. ‘మేము చేసిన సహాయానికి దేవుడి సాక్షిగా ప్రమాణం చేశాం. నిజం మా వైపు ఉంది. ఇక ఈ అంశంపై స్పందించాల్సిన అవసరం లేదు. మిగతా తీర్పు కాణిపాకం వినాయకుడిదేనని స్పష్టం చేశారు.


