రోజుకో పాఠశాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది | - | Sakshi
Sakshi News home page

రోజుకో పాఠశాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది

Jun 29 2026 12:23 AM | Updated on Jun 29 2026 12:23 AM

క్లస్టర్‌ టీచర్లుగా ప్రమోషన్‌ ఇచ్చి పర్మినెంట్‌ పోస్టింగ్‌ ఇవ్వలేదు. దీంతో ఎంఈవో చెప్పిన చోటుకు వెళ్లి పాఠాలు చెప్పాల్సి వస్తోంది. మహిళలు మారుమూల గ్రామాలకు ఎలా వెళ్తారనే విషయాన్ని కూడా చూడడం లేదు. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడి తప్పడం లేదు.

– హిమబిందు, తెలుగు సీనియర్‌ అసిస్టెంట్‌, యాదమరి

ఇదెక్కడి న్యాయం

మేము ఇన్నాళ్లు కష్టపడి పదోన్నతులు పొందితే పర్మినెంట్‌గా ఒక స్కూల్‌ కేటాయించలేదు. ఎక్కడ టీచర్‌ సెలవుంటే అక్కడికి వెళ్లాలని చెబుతున్నారు. ఇది కరెక్ట్‌ అవుతుందా. ఇలా రోజుకో స్కూల్‌లో పాఠాలు ఎలా బోధించాలి. పిల్ల లకు అర్థమవుతుందా. దీనిపై అధికారులు ఆలోచించాలి.

– కవిత, ఎస్‌ఏ తెలుగు, సదుం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement