హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయశాఖ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయశాఖ ఉద్యోగులు

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

చిత్తూరు అర్బన్‌: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి ఎన్‌.జయసూర్యను శనివారం చిత్తూరు జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరు నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.గోపీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా జడ్జి అరుణసారికతో పాటు హైకోర్టు న్యాయమూర్తిని కలిశారు. ఉద్యోగ సంఘం నాయకులు రవిరెడ్డి, లక్ష్మీపతి, రాజేష్‌, రెడ్డెప్ప తదితరులు ఉన్నారు.

వరసిద్ధుడికి వెండి కానుకలు

కాణిపాకం: కాణిపాకంలో వెలసిన స్వయంభు వరసిద్ధి వినాయకస్వామికి శనివారం రాజస్థాన్‌కు చెందిన భక్తుడు పీయూష్‌ అగర్వాల్‌ సుమారు కిలో బరువున్న వెండి టెంకాయ, వెండి లడ్డు, ఇతర వెండి ఆకారాలను కానుకగా సమర్పించారు. వీటి విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. వారికి ఆలయ సూపరింటెండెంట్‌ కోదండపాణి ప్రత్యేక దర్శనం కల్పించి, తీర్థప్రసాదా లు అందజేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం హుబ్లీ కి చెందిన బోండా జాహ్నవి గోసంరక్షణ ట్రస్ట్‌ కు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. అధికారులు వారికి కూడా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.

ప్రకృతి వ్యవసాయంతో

ప్రజలకు ఆరోగ్యం

గుడిపాల: ప్రకృతి వ్యవసాయ సాగు ప్రజలకు ఆరోగ్యం అందించడమే కాకుండా రైతులకు ఆదాయాన్ని ఇస్తుందని వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజశేఖర్‌ తెలిపారు. ఆయన శని వారం పల్లూరులో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్న పీఎండీఎస్‌ క్షేత్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్ధితుల్లో రైతులు గ్రూపుగా ఏర్పడి పీఎండీఎస్‌తో పాటు అంతర పంటలను సాగుచేయడం అభినందనీయమన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్పుడు ఇటువంటి పంటల సాగు ద్వారా స్థిరమైన దిగుబడి సాధించవచ్చన్నారు. 365 రోజు లు భూమి పంటలతో కళకళలాడేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అనంతరం రైతు లకు సోయాబీన్‌ విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మురళి, డీపీఎం శివశంకర్‌, డీపీఓ మురళి, ఏడీఏ ఉమ, మండల వ్యవసాయాధికారి సంగీత, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో శిరీష పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండి క్యూలైన్‌ గోగర్భం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 81,340 మంది స్వామిని దర్శించుకున్నారు. 44,875 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. హుండీలో రూ.3.76 కోట్లు లభించాయి. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement