బాబు అసమర్థత వల్లే అవస్థలు | - | Sakshi
Sakshi News home page

బాబు అసమర్థత వల్లే అవస్థలు

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

మామిడి కిలో రూ.4 ప్రకటించి చేతులు దులుపుకున్న కూటమి ప్రభుత్వం

కర్ణాటకలో కిలోకి రూ.17.5 ప్రకటించిన కేంద్రం

కేంద్ర మంత్రిని చూసి చంద్రబాబు,పవన్‌కళ్యాణ్‌ సిగ్గుపడాలి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి మంగళం : రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ అసమర్థత వల్లే మామిడి రైతులు గిట్టుబాబు ధర లేక అల్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మామిడి కిలోకి రూ.15 గిట్టుబాటు ధర కల్పించాల్సింది పోయి ప్రభుత్వం రూ.4 ప్రకటించి చేతులు దులుపేసుకుంటోందని మండిపడ్డారు. దాంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యా యని వాపోయారు. పంట సాగుకు నాణ్యమైన విత్తనాలు లేక, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

కేంద్ర మంత్రిని చూసి బుద్ధి తెచ్చుకోండి

కర్ణాటకలో ఒకే ఒక ఎంపీగా ఉండి కేంద్ర మంత్రి అయిన కుమార్‌స్వామి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాసి, ఒత్తిడి తెచ్చి కిలో మామిడికి రూ.17.5 ధర కల్పించారని గుర్తుచేశారు. కేంద్రంలో మేం గొప్ప, మేం చెప్పిందే వేదం అని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చేతగాని దద్దమ్మల్లా మారారని విమర్శించారు. కేంద్ర మంత్రి కుమార్‌స్వామిని చూసి సిగ్గుపడాలన్నారు. కేంద్రం మెడలు వంచి రైతులకు న్యాయం చేయాల్సింది పోయి కీలుబొమ్మల్లా ఆడుతున్నారని విమర్శించారు.

గతంలో జగనన్న పోరాటంతో రూ.6

గత ఏడాది మామిడికి గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారబోస్తుంటే చలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అండగా నిలబడి చంద్రబాబు ప్రభుత్వంతో పోరాటం చేశారని భూమన గుర్తు చేశారు. అందువల్లే మామిడి రైతులకు రూ.6 గిట్టుబా టు ధర లభించిందన్నారు. జగనన్న పాలనలో మామి డి రైతులకు ఏనాడూ రూ.20 నుంచి రూ. 25 ధర తగ్గలేన్నారు. ఇప్పుడు గిట్టుబాటు ధర లేక మామిడి రైతులు వారి తోటలను నరికేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో 60వేల మంది రైతులు మామిడి సాగు చేస్తున్నారని, వారికి కనీస ధర లేక తోటలను నరికేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్ప్‌ ఫ్యాక్టరీల్లో కూడా పది టన్నుల్లో ఐదు టన్నులను మాత్రమే తీసుకుని మిగిలిన ఐదు టన్నులను వద్దని తిరిగి పంపేస్తున్నారన్నారు. వాటిని రోడ్డుపై పారబోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, అనేక మంది రైతులు చెట్లల్లోనే కాయలను వదిలేస్తున్నారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement