– 8లో
– 8లో
మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
కొద్ది రోజుల క్రితం తోతాపురి ధరను కిలోకు రూ.5కు తగ్గించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఫ్యాక్టరీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కిలోకు రూ.6 చెల్లిస్తున్నట్లు ఫ్యాక్టరీల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ నిర్ణయం ఎక్కువ రోజులు నిలవలేదు. శనివారం మళ్లీ బోర్డులు మార్చి కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తామని ప్రకటించాయి. అలాగే గుడిపాల, తవణంపల్లి, బంగారుపాళ్యం, ఐరాల, పూతలపట్టులోని మామిడి ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు కూడా అదే ధరను అమలు చేస్తున్నాయని రైతులు మండిపడుతున్నారు. ఇక ఫ్యాక్టరీల వద్ద ధర తగ్గిపోవడంతో ర్యాంపుల వద్ద వ్యాపారులు కిలోకు రూ.3కే కొనుగోలు చేస్తున్నారు. కూలీల ఖర్చు, రవాణా వ్యయం కూడా రావడం లేదని, కాయలు కోసి అమ్మినా నష్టమే, కోయకుండా వదిలినా నష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కిలో రూ.5


