జీడీనెల్లూరులోని మామిడి రైతులు శనివారం రోడ్డెక్కారు. తోతాపురి కేజీ రూ.5లని ఎలా బోర్డు పెడతారని గుజ్జు ఫ్యాక్టరీల ఎదుట నిరసనకు దిగారు. కిలో రూ.6లకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పుత్తూరు జాతీయ రహదారి స్తంభించింది. వాహనాలు బారులు తీరాయి. పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడి నిరసనను విరమింపజేయడానికి ప్రయత్నించారు. వారు ససేమిరా అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలాగే తూగుండ్రం రోడ్డులోని మరో ఫ్యాక్టరీ ఎదుట కూడా రైతులు ధర్నాకు దిగారు. ఫ్యాక్టరీ లోపల నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ఫ్యాక్టరీల సిండికేట్ దెబ్బతో గుడిపాలలోని ఫ్యాక్టరీలు కూడా బోర్డు తిప్పేశాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఫ్యాక్టరీ నిర్వాహకులతో ప్రశ్నల వర్షం కురిపించారు.


