అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

Jun 28 2026 2:38 AM | Updated on Jun 28 2026 2:38 AM

చిత్తూరు కలెక్టరేట్‌: గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి సంఘం సభ్యురాలికీ ప్రభుత్వ పథకాలు చేరువ కావాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అముద అధ్యక్షతన శనివారం సమాఖ్య సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ సంఘం సభ్యులను ఆర్థికంగా. సామాజికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. రుణాల విషయంగా ముందస్తు ప్రణాళికలు అవసరమన్నారు. అర్హతలు, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని సంఘాలకు రుణాలను అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోని సంఘం సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా సమాఖ్య రోవర్‌ ఎన్జీఓతో ఎంవోయూ చేసుకున్నారు. సమావేశంలో రోవర్‌ సంస్థ సీఈవో శివకుమార్‌, ఏపీఎంలు సుబ్బారెడ్డి, మధు, పలువురు డీఆర్‌డీఎ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement