పలమనేరు/బంగారుపాళెం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వర్‌రావు అలియాస్ నానాజీపై చర్యలు తీసుకోవాలని పలమనేరు, బంగారుపాళెంకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. వారు శనివారం పలమనేరు పట్టణ ఎస్‌ఐ స్వర్ణతేజ, బంగారుపాళెం సీఐ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పాలఏకరి విభాగం అధ్యక్షులు, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు(నానాజీ) ఈ నెల 21వ తేదీన ప్రెస్‌మీట్‌లో మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా వీడియోలను షేర్ చేస్తూ రాజకీయ విధ్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పంతం వెంకటేశ్వరరావు, ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పలమనేరు పట్టణ, గంగవరం మండల కన్వీనర్లు హేమంత్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, నాయకులు జాఫర్, శ్యామ్‌సుందర్‌రాజ్, నరేష్, ముజ్దు, జరావారిపల్లి సర్పంచ్, బంగారుపాళెం మండల విప్, తగ్గువారిపల్లె ఎంపీటీసీ హేమచంద్ర, సోషల్ మీడియా రాష్ట్ర సంయక్త కార్యదర్శి కిషోర్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శులు సుబ్రమణ్యం, మునీంద్ర, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి రఘుపతిరాజు, జిల్లా మాజీ యూత్ ఉపాధ్యక్షుడు మహీంద్ర, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగరాజ, మండల యూత్ అధ్యక్షుడు గజేంద్ర, మాజీ యూత్ అధ్యక్షుడు జగదీష్, బూత్ కమిటీ కోఆర్డినేటర్ జగదీష్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు శైలేష్, పార్టీ మండల కార్యదర్శి ముబారక్, కుమారస్వామి, ప్రదీప్, మణి, కార్తీక్, బద్రి, వినోద్ పాల్గొన్నారు.
కాకినాడ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెట్టండి
చిత్తూరు అర్బన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. వారు శనివారం చిత్తూరు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ న్యాయ విభాగం చిత్తూరు అధ్యక్షుడు జి.సూర్యప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత ధూషణలు ఉండకూదన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత, నీఛమైన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించుకోరని పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో పదే పదే ప్రచారం చేస్తూ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నానాజీపై వెంటనే క్రిమినల్ కేసు నమోదుచేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ న్యాయ విభాగం అధ్యక్షుడు చక్రవర్తిరెడ్డి, ఆ విభాగం నేతలు సివి.రెడ్డి, మాలతి, సయ్యద్, షేక్ అమ్‌జాద్ పాల్గొన్నారు.


