అర్హుల ఓట్లు పోకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

అర్హుల ఓట్లు పోకుండా చూడాలి

Jun 28 2026 2:38 AM | Updated on Jun 28 2026 2:38 AM

● పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి ● ఓటర్ల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

నిండ్ర (నగరి) : అర్హుల ఓట్లు తొలగించకుండా బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. ఆమె శనివారం నిండ్ర మండలంలోని ఇరుగువాయి, జీఎన్‌ కండ్రిగ పంచాయతీల్లోని 194, 195 పోలింగ్‌ బూత్‌ల్లో జరుగుతున్న సర్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ బీఎల్‌ఏలు, మండల పరిశీలకులు, స్థానిక నాయకులతో సమావేశమై క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. బూత్‌ల వారీగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, అనర్హులైన ఓటర్ల తొలగింపు, ఫారాల దాఖలు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి బూత్‌ పరిధిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటర్లకు ఎదురయ్యే ప్రతి సమస్యనూ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించేలా చూడాలన్నారు. నియోజకవర్గ బూత్‌ కమిటీ అధ్యక్షుడు సురేష్‌ రాజు మాట్లాడుతూ ప్రతి బూత్‌లోనూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన వారి ఓటును పరిరక్షించే దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ దీప, పార్టీ మండల అధ్యక్షుడు వేణురాజు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్‌, మునికృష్ణారెడ్డి, అనీల్‌కుమార్‌, దాము, మాజీ వైస్‌ ఎంపీపీ రాము, రమేష్‌, రాము, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement