చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని ఫ్యాక్టరీలకు ఈ నెల 20వ తేదీకి ముందు మామిడి సరఫరా రైతులకు టన్నుకు రూ.4 వేలు ప్రోత్సాహకం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మునిరత్నం, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరత్నం నాయుడు కోరారు. వారు శనివారం జేసీ ఆదర్శ్ రాజేంద్రన్‌కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం జూన్ 20వ తేదీన తోతాపురి మామిడి రైతులకు టన్నుకు రూ.4 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించిందన్నారు. జూన్ 20వ తేదీకి ముందే పల్ప్ పరిశ్రమలు, ర్యాంపుల ద్వారా లక్ష టన్నుల తోతాపురి మామిడిని రైతులు సరఫరా చేశారని పేర్కొన్నారు. వారికి కూడా రూ.4 ప్రోత్సాహకాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మునిరత్నంనాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా నాయకులు ఉమాపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.


