విద్యుత్‌ సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించండి

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

● రెవెన్యూ సమస్య పరిష్కారం కాకపోవడమే కారణం ● అడ్డుకుని కాపాడిన పోలీసులు

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ సమస్యలు సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు ఆ శాఖ అధికారులను ఆదేశించా రు. సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో రాత్రి సమయంలో విద్యుత్‌ అంతరాయం తరుచూ వస్తోందని, లైన్‌మెన్‌కు ఫోన్‌చేసినా స్పందించలేదని శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. జీడీనెల్లూరు మండలం నందనూరు గ్రామంలో బిల్లింగ్‌ సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని రాణి సమస్యను తెలిపారు. విజయపురం మండలం జగన్నాథపురం గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు మరొకటి పెట్టలేదని శ్రీరాములు ఫిర్యాదుచేశారు. వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారించాలని ఎస్‌ఈ అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

చిత్తూరు కలెక్టరేట్‌ : చాలా సంవత్సరాలుగా రెవెన్యూ సమస్య పరిష్కారం కావడం లేదని వి.కోట మండలం గోనుమాకులపల్లెకు చెందిన బాధిత రైతు రాఘవేంద్ర ఆత్మహత్యకు యత్నించాడు. సోమవారం చిత్తూరులోని కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు విచ్చేసిన ఆ రైతు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే పెట్రోల్‌ క్యాన్‌ తీసుకుని ఆయనను కాపాడారు. అనంతరం బాధిత రైతు విలేకరులతో మాట్లాడుతూ.. గోనుమాకులపల్లె గ్రామంలో తమకు సర్వే నంబర్‌ 539/4లో 0.72 సెంట్లు, 539/2 లో 1.03 ఎకరా, 539/3 లో 0.29 సెంట్లు మొత్తం 2 ఎకరాల భూమి ఉందన్నారు. సంబంధిత భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేయగా, గత 35 సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉందని తెలిపారు. అయితే తన తండ్రి అన్నదమ్ములు తమకు సంబంధిత భూమిలో వాటా ఉందని ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిపారు. తమకు తెలియకుండానే దొంగ సంతకాలతో ఆన్‌లైన్‌ చేయించుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతు డిమాండ్‌ చేశాడు.

విద్యుత్‌ షాక్‌తో

యువకుడి మృతి

కార్వేటినగరం: విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో ని వత్తులూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వత్తులూరు గ్రామానికి చెందిన రవిరెడ్డి కుమారుడు డి.విక్కీ (32)కి సొంత పాల డెయిరీ ఉంది. అందులో దిన చర్యలో భాగంగా ఆవులను వాటర్‌ గన్‌తో శుభ్రం చేస్తున్న తరుణంలో వాటర్‌ గన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరగడంతో విక్కీ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు అతనిని తమిళనాడులోని కోనాటంపేట వద్ద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విక్కీకి రెండు సంవత్సరాల క్రితమే వివాహమైందని, అతనికి భార్య, ఒక్క సంవత్సరం కుమారుడు ఉన్న ట్లు తెలిపారు. విక్కీ తిరుపతిలోని మహిళా యూనివర్శిటీలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విక్కీ తండ్రి రవిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వేదిక్‌లో ప్రవేశాలకు

రేపే ఆఖరు

తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి శాసీ్త్ర (బీఏ), ఆచార్య (ఎంఏ), విద్యావారధి (పీహెచ్‌డీ)తో పాటు పలు డిప్లొమో, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనున్నట్టు అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులతో పాటు మరిన్ని వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను, లేదా 08772222587, 9701001777 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

గడువు పొడిగింపు

తిరుపతి సిటీ: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్లు విడుదలచేసింది. దీన్ని సోమవారం చివరి గడువుగా నిర్ణయించింది. అర్హత ఉండి ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని అభ్యర్థుల కోసం దరఖాస్తుల గుడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్టు ఎస్వీయూ రిజిస్ట్రార్‌ ఆచార్య భూపతి నాయుడు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 22వ తేదీలోపు ఆయా విశ్వవిద్యాలయాలకు అందించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement