బడుగు బలహీన వర్గాలను విస్మరిస్తున్న చంద్రబాబు అర్హులైన పేదలకు సంక్షేమం అందించిన ఘనత జగనన్నది మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
కార్వేటినగరం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరుపేదలైన బడుగు, బలహీన వర్గాలకు చెందిన మేధావులను రాజ్యసభలో స్థానం కల్పిస్తే.. నేడు కూటమి ప్రభుత్వం అందుకు బిన్నంగా పెత్తందారులకు కట్టబెడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. పుత్తూరులో సోమవారం ఆయన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులతో కలసి జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో నల్ల బెలూన్లు ఎగుర వేశారు. ఈ సందర్భంగా నరాయణస్వామి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమాలు అందించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిది అయితే సీఎం చంద్రబాబునాయుడు బడుగు, బలహీన వర్గాలను విస్మరించి పెత్తందార్లకోసం దోచిపెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. అన్ని సామాజికవర్గాలకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా పేదలను అణగదొక్కడం, తమ సామాజిక వర్గాలకు దోచిపెట్టడమే లక్ష్యమన్నారు. ఎప్పుడు అధికారానికి వచ్చినా కులాల మధ్య చిచ్చుపెట్టడం, సంక్షేమ పథకాల పేరుతో ప్రజా దనాన్ని దోచుకోవడమే ఆయన లక్ష్యమని ఆరోపించారు. పవన్‌కళ్యా ణ్, ప్రధాని మోదీ లేకుంటే చంద్రబాబుకు ఓటమి పాలయ్యేవారని నారాయణస్వామి చురకలు అంటించారు. మహిళలకు 35 శా తం రిజర్వేషన్ కల్పిస్తామన్న మంత్రి లోకేష్ రాజ్యసభలో ఒక్క మహిళకు కూడాఅవకాసం కల్పించలేక పోయారన్నారు. కాపుల కోసం నేను ఎప్పుడూ పోరాటం చేస్తానన్న పవన్‌కళ్యాణ్ రాజ్యసభ సీటు కోసం ఎందు కు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.
లింగమనేని రమేష్ రాజ్యసభకు ఎలా వెళ్లారు..?
ఎపుడూ జనసేన కోసం పోరాటం చేసింది లేదు. ఎప్పుడూ జనసేన జెండా మోసింది లేదు. అలాంటి కాపు సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్‌కు రాజ్యసభలో ఎలా స్థానం కల్పించారని నారాయణస్వామి ప్రశ్నించారు. కరకట్టను దోచుకున్న లింగమనేని, అదే కరపట్టపై చంద్రబాబుకు ఇల్లుకట్టి బహుమతిగా ఇచ్చినందుకు రాజ్యసభలో స్థానం కల్పించారని విమర్శించారు.
ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలి
వైఎస్సార్‌సీపీలోని ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయాల్సిన సమయం ఆసన్నమైయిందని నారాయణస్వామి పిలుపునిచ్చారు. గ్రామాల్లో కూడా నాయకులు కార్యకర్గలను కలుపుకుపోవాలని సూచించారు. నేడు పార్టీకోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.


