– పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశం
కుప్పం: సమస్యలపై బాధితులు అందజేసిన వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులను ఆదేశించారు. కుప్పం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 26 వినతులను ఎస్పీ స్వీకరించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు సంబంధించి పలువురు తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీని కలసి నినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి వినతి పరిశీలించి పరిష్కారించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ పార్థసారది, సీఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


