కుళ్లి | - | Sakshi
Sakshi News home page

కుళ్లి

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

చెట్లపై కుళ్లిపోతున్న కాయలు ఫ్యాక్టరీల గేట్ల వద్ద రైతుల నిరీక్షణ 35 ఫ్యాక్టరీల్లో కొనుగోళ్లు చేస్తున్నవి ఐదు సిఫార్సులున్న వారికే పచ్చజెండా సామాన్య రైతుకు నిరాకరణ పట్టించుకోని ప్రభుత్వం

రాలి
కొనుగోళ్లు చేస్తున్నవి ఐదు ఫ్యాక్టరీలే..

కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 57 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ఇందులో 40 వేల హెక్టార్లకు పైగా తోతాపురి పంట సాగవుతోంది. జ్యూస్‌, పల్ప్‌ పరిశ్రమలకు ప్రధాన ముడిసరుకై న తోతాపురికి దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో దిగుబడి కూడా భారీగా వచ్చింది. రైతుల అంచనా ప్రకారం సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల తోతాపురి దిగుబడి వచ్చింది. దిగుబడి పెరగడం రైతుకు శాపంగా మారింది.

గంగాధర నెల్లూరులో రైతుల ఆగ్రహం

గంగాధర నెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టోకె న్లు ఇచ్చినా కాయలు అన్‌లోడ్‌ చేయడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. ఐడీ కార్డులు పంచి పెట్టడం, కాయల అన్‌లోడింగ్‌లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. సిఫార్సులు ఉన్న వారి కాయలను రాత్రిళ్లు అన్‌లోడింగ్‌ చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

సిఫార్సులు ఉంటేనే కొనుగోళ్లు..?

గుడిపాల ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ సిబ్బంది సిఫార్సులు ఉన్న రైతుల కాయలనే ముందుగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ‘బుధవారం నుంచి కొనుగోలు ప్రారంభం కానుంది. ముందుగా శాంపిల్‌ చూపించండి’ అంటూ రైతులను తిప్పలు పెడుతున్నారని వాపోతున్నారు.

జోక్యం చేసుకోని ప్రభుత్వం

ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అన్ని పల్ప్‌ ఫ్యాక్టరీలను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, కొనుగోళ్లలో పారదర్శకత తీసుకురావాలని కోరుతున్నారు. టోకెన్‌ విధానాన్ని క్రమబద్ధీకరించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిఫార్సులు, వివక్షకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

జిల్లాలో మామిడి రైతులకు కష్టాలు

జిల్లాలో తోతాపురి ప్రాసెసింగ్‌ కోసం సుమారు 35 పల్ప్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గతేడాది లాగే ఈ సారి సీజన్‌ ప్రారంభమై రోజులు గడుస్తున్నా చాలా ఫ్యాక్టరీలు కొనుగోళ్లను పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. పేరుకు ప్రారంభోత్సవాలు చేసినా క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఐదు ఫ్యాక్టరీలు మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని వేలాది మంది రైతులు కొద్దిమంది కొనుగోలుదారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్యాక్టరీల సంఖ్య తక్కువగా ఉండడంతో టోకెన్ల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. టోకెన్‌ వచ్చినా వెంటనే కాయలు అన్‌లోడ్‌ కావడం లేదు. ఫ్యాక్టరీ గేట్ల వద్ద ట్రాక్టర్లు, లారీలు వరుసగా నిలిచిపోతున్నాయి. రైతులు రెండు, మూడు రోజుల వరకు వాహనాల్లోనే ఉండాల్సి వస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement