పైపులు ఏర్పాటు చేయని అధికారులు ట్యాంకర్లతో నెట్టుకొస్తున్న వైనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామీణులు
కుప్పం మండల పరిధిలో కొన్ని గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్రీఫేజ్ కరెంట్ వచ్చేవరకు వేచి ఉండి వ్యవసాయ బావులు, బోర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. మరికొన్ని గ్రామాల్లో బోర్లు ఒట్టిపోయాయి. కొన్ని గ్రామాల్లో అధికారులు ట్యాంకర్ల ద్వారా నెట్టుకు వస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని నాయకులు చెప్పడమే కానీ ఆచరణలో పెట్టడం లేదని మహిళలు వాపోతున్నారు.
కుప్పం రూరల్ : మండల పరిధిలోని సిద్ధప్పనూరు, గొడప్పనూరు, పేటగుట్ట గ్రామాలు శాశ్వత తాగునీటి పరిష్కారానికి నోచుకోవడం లేదు. సిద్ధప్పనూరుకు తాగునీటి సదుపాయం లేకపోడవంతో గ్రామస్తులు సొంత ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. గౌడప్పనూరు విషయానికి వస్తే అధికారులు ట్యాంకర్ల ద్వారా అరకొర నీటిని సరఫరా చేస్తూ నెట్టుకు వస్తున్నారు. గటప్పనాయనపల్లి బండ్ల వద్దా ఇదే సమస్య. వీటిపై అధికారులు దృష్టిసారించక పోవడంతో తాగునీటికి అవస్థలు తప్పడం లేదు.
బోర్లలో నీరు ఉన్నా..
అడవిబూదుగూరు గ్రామంలో రక్షిత బోరులో నీరు ఉన్నా పైపులైన్లు ఏర్పాటు చేయకపోవడంతో సమస్య నెలకొంది. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొంత ఖర్చు పెట్టి పైపులైన్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి వృథా ఖర్చులు మిగులుతాయని గ్రామస్తులు అంటున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు చాలకపోవడంతో వ్యవసాయ బోర్లను ఆశ్రయించక తప్పడం లేదు.
అడవిబూదుగూరులో ట్యాంకర్ వద్ద నీరు పట్టుకుంటున్న మహిళలు
జాతీయ రహదారిపై నిరసన తెలుపుతున్న సామగుట్టపల్లి మహిళలు(ఫైల్)
బోర్లలో నీరు ఉన్నా ఫలితం శూన్యం
జాతీయ రహదారిపై మహిళల ధర్నా
గత నెలలో తాగునీటి సదుపాయం కల్పించాలని మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలోని మహిళలు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. అప్పటికేమో అధికారులు నీటి సదుపాయం కల్పిస్తా మని హామీ ఇచ్చారు. నిరసన మిరమింపజేశా రు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. గ్రామానికి వస్తున్న ఒకటి అరా ట్రాక్టర్ నీరు సరిపోవడం లేదని మహిళలు వాపోతున్నారు. అందులోను పనులు వదిలిపెట్టి ట్యాంకర్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. అధికారులు శాశ్వత తాగునీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.


