మామిడి రైతులను ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతులను ఆదుకోండి

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): మామిడి రైతులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎంఎల్‌సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మామిడి పంట సాగుచేస్తున్న రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కనీస గిట్టుబాటు ధరను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

కాణిపాకానికి పోటెత్తిన భక్తులు

కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు వేసవి సెలవులు కొనసాగుతుండడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. సమస్యలపైవినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా

పోలీసుల తనిఖీలు

చిత్తూరు అర్బన్‌: ముందస్తు నేరాల నియంత్రంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివా రం తనిఖీలు నిర్వహించారు. కార్వేటినగరంలో నాటు సారా తయారీకి ఉపయోగించే 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. చిత్తూరు వన్‌ టౌన్‌, టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని 20 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 70 మందికి డ్రగస్స్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా చిత్తూరు తాలూకా, యాదమరి ప్రాంతాల్లో ఐదుగురికి మాదకద్రవ్యా ల పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. వీళ్లకు ప్రత్యేకించి కౌన్సెలింగ్‌ చర్య లు హెచ్చరించారు.

నేడు కుప్పంలో పోలీసు గ్రీవెన్స్‌

చిత్తూరు అర్బన్‌: కుప్పం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్‌ డూడీ తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement