చిత్తూరు అర్బన్ : ప్రజల నిత్యజీవితంలో యోగా భాగం కావాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం కూడలి వరకు యోగాంధ్ర ర్యాలీని ఎమ్మెల్యే, జేసీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కార్పొరేషన్ కార్యాలయం నుంచి రైల్వే వంతెన మీదుగా గాంధీ కూడలి వరకు సాగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్స వం సందర్భంగా రానున్న 15 రోజులు జిల్లా వ్యాప్తంగా గ్రామ– వార్డు సచివాలయం పరిధిలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 200 మంది మాస్టర్ ట్రైనీలను గుర్తించామని, వారి ద్వారా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నా రు. ఈ నెల 9న వైద్య ఆరోగ్యశాఖ ద్వారా జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కాణిపాకం, పులిగుండు వద్ద థీమాటిక్ యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలు, యువ త, మహిళలు, విద్యార్థులు యోగా కార్యక్రమాలను విస్తతంగా చేపట్టడం ద్వారా ఆరోగ్య చిత్తూరుగా తీర్చి దిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి సుబ్బరాజు, నాన్ కేడర్ ఎస్పీ ఎస్.ఆర్ రాజశేఖర్ రాజు, కమిషనర్ పి.నరసింహ ప్రసాద్, డీఎంహెచ్‌ఓ నాగశశి భూషణ్ రెడ్డి, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కార్పొరేషన్ ప్రజారోగ్య శాఖ అధి కారి డాక్టర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.


