మట్టిని నమ్మాడు.. | - | Sakshi
Sakshi News home page

మట్టిని నమ్మాడు..

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

– 8లో

ఉన్నత విద్యచదివి పెద్దపెద్ద ఉద్యోగాలు చేసిన వ్యక్తి వాటిని వదిలేసి మట్టిని నమ్మి వ్యవసా యం చేసి విజయం సాధించాడు.

కుళ్లిపోతున్నాయి..

కాయలు కోత దశలో ఉన్నాయి. గాలి వానకు చాలా వరకు రాలిపోయాయి. కొన్ని కాయలు కుళ్లిపోయి రాలిపోతున్నాయి. వారం రోజులు దాటితే కాయలు కోయాల్సిన అవసరం లేదు. రాలిపోయే పడిపోయే పరిస్థితి ఉంది. గతేడాది ప్రభుత్వం తోతాపురి కేజీకి ప్రోత్సాహక నిధిగా రూ.4లు ఇచ్చింది. ఈ సారి నోరు మెదపడం లేదు.

– మురళీమోహన్‌నాయుడు,

వరదరాజులపల్లి, చిత్తూరు మండలం

అన్‌లోడింగ్‌కు మూడు రోజులు

కాయలు కోత కోసి ట్రాక్టర్‌కు లోడ్‌చేసి పెట్టా. ఇప్పుడు గంగాధరనెల్లూరు ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళితే అన్‌లోడింగ్‌కు మూడు రోజులు పడుతుందని చెబుతున్నారు. ఇప్పటికి అదేక్కొటే తెరిచి ఉండారు. గుడిపాలలోని ఓ ఫ్యాక్టరీ మాత్రం సిఫార్సులు ఉంటేనే కాయలు కొంటున్నారు. గట్టిగా అడిగితే బుధవారం నుంచి కొంటామని పంపించేస్తున్నారు.

– విజయనాయుడు, వరదరాజులపల్లి, చిత్తూరు మండలం

ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో తెరవాలి..

కాయలు పండిపోతున్నాయి. పక్వానికి వచ్చిన కాయలనే కోయాలని అధికారు లు చెబుతున్నారు. ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో తెరిచేలా చూడడం లేదు. కాయలు బాగాలేవని, పక్వానికి రాని వాటిని తెచ్చేస్తున్నారని రైతులపై నిందలు వేస్తున్నారు. కాయలను ఒకేసారి కోస్తే రేట్ల విషయంలో గందరగోళం సృష్టించవచ్చని ఫ్యాక్టరీలు మూకుమ్మడిగా కుట్ర పన్నుతున్నాయి.– సాము,

పెరుమాళ్ల కండ్రిగ, చిత్తూరు మండలం

Advertisement
 
Advertisement
Advertisement