కొత్తగా ఏర్పాటైన దక్షిణకోస్తా జోన్‌కు రావాల్సిన ఆదాయాన్ని రాబట్టడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ జోన్‌కు రావాల్సిన భారీ ఆదాయం ఈస్‌కోస్ట్ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఈ విషయమై లోక్‌సభలో కూడా ప్రస్తావించాను. తిరుపతి కేంద్రంగా బాలాజీ (తిరుపతి) డివిజన్ చేయాలన్న డిమాండ్‌ను నెరవేర్చకుండానే జోన్‌ను ప్రారంభించడం బాధాకరమని, ఈ విషయంలో కూట మి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు.
– పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట
రాయలసీమ రైల్వేలకు న్యాయం చేయాలి
దక్షిణ మధ్య రైల్వే నుంచి 60 ఏళ్ల తర్వాత విడిపో యి దక్షిణకోస్తా రైల్వేలోకి బదిలీ అయిన రాయలసీమ రైల్వేలకు ఇప్పుడైనా పూర్తి న్యాయం చేయాలి. వైఎస్సార్ కడప జిల్లా మీదుగా కొత్త రైళ్లను తీసుకురావాలి. వైఎస్సార్ మానసపుత్రిక అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలి. సీమ రైల్వే పరిధిలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైలు మార్గాలను పూర్తి చేసే దిశగా నూతన ఎస్సీవోఆర్ యాజమాన్యం ఆలోచన చేయాలి. తిరుపతి డివిజన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలి. – మేడా రఘునాథరెడ్డి, ఎంపీ


