యోగా దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

యోగా దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

Jun 8 2026 6:48 AM | Updated on Jun 8 2026 6:48 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరులోని ప్రశాంత్‌ నగర్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న యోగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగశశిభూషణ్‌రెడ్డి పరిశీలించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యోగా కార్యక్రమం విజయవంతం కావడానికి శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

పెనుమూరు(కార్వేటినగరం): పెనుమూరు మండలం గుట్టకింద హెచ్‌డబ్ల్యూ సమీపంలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీశారు. ఆయన మాట్లాడుతూ మృతుడికి 45 ఏళ్లు ఉంటాయని, చుట్టుపక్కల విచారించినా ఆచూ కీ తెలియలేదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement