చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఐఈవో రఘుపతి తెలిపా రు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడు తూ జిల్లాలో సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
ఆహార భద్రత చట్టంపై
అవగాహన అవసరం
చిత్తూరు అర్బన్: ఆహార భద్రత చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్.భారతి తెలిపారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని సోమవారం జరు పుకోనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం చిత్తూ రు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కల్తీ ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆహార కల్తీ చట్టం–2006పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కల్తీ ఆహార పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ, కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కలుషిత ఆహారం తిని మృతి చెందిన, అనారోగ్యం పాలైన వారికి నష్టపరిహారం ఇప్పి స్తామన్నారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికలపై లైంగిక వేధింపులు – చట్టాలు, శిక్షలపై అవగాహన కల్పించారు. కల్తీ ఆహార పదార్థాలను గుర్తించడంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ పి.నరసింహ ప్రసాద్, ప్రజారోగ్యశాఖ అధికారి లోకేష్, మెప్మా సీఎంఎం గోపి పాల్గొన్నారు.
గురుకులాల్లో 5వ తరగతి స్పాట్ అడ్మిషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో స్పాట్ అడ్మిషన్లు ఇస్తున్నట్టు ఏపీఎస్‌డబ్ల్యూఆర్ జిల్లా కో ఆర్డినేటర్ పద్మజ తెలిపారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష మెరిట్ జాబితాలో ఉన్న విద్యార్థులతో పాటు పరీక్ష రాయని వారు కూడా స్పాట్ అడ్మిషన్లకు రావొచ్చన్నారు. రామకుప్పం బాలురు గురుకులంలో 46 సీట్లు, విజిలాపురంలో 29, చిత్తూరు బాలికల పాఠశాలలో 15, జీడీ నెల్లూరు బాలికల పాఠశాలలో 10, పలమనేరు బాలికలు 12, కుప్పం పరమసముద్రం బాలికల పాఠశాలలో 35 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 8న చిత్తూరులోని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని, ఆధార్‌కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతోపాటు ఒరిజనల్, జిరాక్స్ కాపీలు తీసుకురావాలని తెలిపారు.


