ఐరాల: నవచేతన్ యాప్ ద్వారా ఆరేళ్ల లోపు పిల్లల్లో సమగ్రాభివృద్ధి సాధించడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా పీడీ వెంకటేశ్వరి ఆదేశించారు. కాణిపాకం జెడ్పీ హైస్కూల్‌లో శనివారం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఏఐ నవచేతన్ యాప్, ఈసీడీ స్క్రీనింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ఆరేళ్ల పిల్లలందరికీ నవచేతన్ యాప్ ద్వారా సంపూర్ణ పోషణ, గ్రోత్ మానిటరింగ్, సలహాలు, మైక్రో న్యూట్రీషియన్స్‌పై వివరించారు. ప్రతి బిడ్డకూ తల్లుల సమక్షంలోనే స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి 1000 రోజులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఐరాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో నిర్మల, కాణిపాకం పీహెచ్‌సీ వైద్యాధికారి స్వాతిసింధూర, సూపర్‌వైజర్ మంజుల, బీసీపీ నజరీన్ పాల్గొన్నారు.


