గంగాధర నెల్లూరు: మామిడికాయలు పక్వానికి వచ్చిన తర్వాతే కోయాలని జిల్లా ఉద్యానవన అధికారి సతీష్, ఉద్యానవన సహాయ సంచాలకులు శ్రీ కోటేశ్వరరావు తెలిపారు. వారు శనివారం 100 గొల్లపల్లి జైన్ ఫ్యాక్టరీ, తూగుండ్రం రూట్‌లో ఉన్న జైన్ ఫ్యాక్టరీని సందర్శించారు. జైన్ ఫ్యాక్టరీ వద్ద రైతులతో మాట్లాడారు. మామిడి రూ.7 కంటే తగ్గే అవకాశం లేదన్నారు.
కోడిపందెం రాయుళ్ల అరెస్ట్
ఐరాల: మండలంలోని మొరంపల్లె సమీపంలో కోడిపందేలు ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ జయశ్రీ తెలిపారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. ఈ దాడిలో మండలంలోని తోటివారిపల్లె, మొరంపల్లె చెందిన ఈ.గుణశేఖర్, జీ.శ్రీనివాసులు, పూతలపట్టు మండలం అలగానిపల్లెకు చెందిన టీ.భరత్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి మూడు పందెం కోళ్లు, రూ.11 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమో దు చేసినట్లు వెల్లడించారు.


