జిల్లా ఉద్యానశాఖ అధికారి బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఉద్యానశాఖ అధికారి బాధ్యతల స్వీకరణ

Jun 6 2026 12:05 AM | Updated on Jun 6 2026 12:05 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లా ఉద్యానశాఖ అధికారిగా సతీష్‌ శుక్రవారం చిత్తూరులోని జిల్లా ఉద్యాన శాఖ కా ర్యాలయంలో బాధ్యత లు స్వీకరించారు. ఈయ న వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సతీష్‌ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో మామిడి కోత దశలో ఉందన్నారు. దీనిపై కలెక్టర్‌ ఇచ్చిన సూచనల మేరకు మామి డి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.

ప్రకృతి సమతుల్యత

అందరి బాధ్యత

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రకృతి సమతుల్యత అందరి బాధ్యత అని మైభారత్‌ శాఖ యువజన అధికారి ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతి సమతులత్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్క రూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవాలన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్‌భాస్కర్‌, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ మురళి, మైభారత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

శిక్షణ కేంద్రాల తనిఖీ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా టీచర్లకు నిర్వహిస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణలను అబ్జర్వర్‌ రాము తనిఖీ చేశారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ నిర్వహణపై ‘అస్తవ్యస్తంగా ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. రాష్ట్ర అబ్జర్వర్‌ రాము శుక్రవారం జిల్లాలోని పలు శిక్షణ కేంద్రాలను తనిఖీ చేశారు. శిక్షణ పొందుతున్న టీచర్లకు కల్పించిన మౌలిక వసతులు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన తనిఖీలో గమనించిన అంశాలను నివేదిక రూపంలో రాష్ట్ర సమగ్రశిక్ష శాఖ అధికారులకు అందజేయనున్నారు.

ఆర్‌డీవో, డిప్యూటీ కలెక్టర్ల నియామకం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో పలువురు ఆర్‌డీవోలను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు కుప్పం ఆర్‌డీవోగా షేక్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌, స్పెష ల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేడర్‌లో పుల్లారెడ్డి (ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌)గా, మధుసూదన్‌రావు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా నియమితులయ్యారు.

నేడు స్థాయి సంఘాల సమావేశం

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లా పరిషత్‌ స్థాయి సంఘాల సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. శనివారం ఉదయం పది గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఆర్థిక, ప్ర ణాళిక, పనులు, గ్రామీణభివృద్ధి, విద్య, వైద్య, వ్యవసాయం, సీ్త్ర శిశు సంక్షేమం, సాంఘికసంక్షేమ శాఖ పరంగా చర్చ జరుగుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement