ప్రజల విశ్వాసాన్ని పొందడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజల విశ్వాసాన్ని పొందడమే లక్ష్యం

Jun 6 2026 12:05 AM | Updated on Jun 6 2026 12:05 AM

– 8లో

ప్రజల విశ్వాసాన్ని పొందడమే ఆటోడ్రైవర్ల లక్ష్యమని, ఆ దిశగా ముందుకు సాగాలని ఎస్సీ తుషార్‌ డూడి సూచించారు.

ఏంది సామీ ఈ బాధలు

రైతులను ఈ రకంగా ఇబ్బంది పెట్టిస్తే ఎలా..? కాయలు పండించేది...కాపుకాసేది ఒక ఎత్తు అయితే..వాటిని ఫ్యాక్టరీలో అమ్మడం చానా కష్టంగా ఉంది. ఐడీ కార్డులు అంటారు...టోకన్లు అంటారు.. రెండు రోజుల తర్వాత రా అంటున్నారు. కాయలు అన్‌లోడ్‌ చేయాలంటే మూడు రోజులు అవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే..రాను..రాను మా పరిస్థితిఏంటి?. ఏందీ సామీ ఈ బాధలు మాకు. –సుధాకర్‌, అగరమంగళం, జీడీనెల్లూరు

వర్షం పడితే పూర్తిగా నష్టం

రుతుపవనాల రాకతో మామిడి పూర్తి స్థాయి కోతకు కాక ముందే వర్షాలు పడుతున్నా యి. పక్వానికి వచ్చిన మామిడి కాయలను కోసి ఫ్యాక్టరీలకు తరలిస్తున్నా సకాలంలో అన్‌లోడ్‌ కావడం లేదు. మూడు నాలుగు రోజుల పాటు రోడ్డు మీదే గడపాల్సి వస్తోంది. వర్షంలో మామిడికాయలు తడిస్తే పురుగులు పట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా మామిడిని కొనుగోలు చేసి రైతులకు మేలు కలిగేలా ప్రభుత్వాలు చర్యలు చేయాలి. – మురళి,

కోత్తూరు గ్రామం, వెదురుకుప్పం మండలం

సిబ్బంది చేతివాటం

ఏడాది పాటు కన్నబిడ్డలా సాకిన మామిడి పంట కోతకు వచ్చి రోజులు తరబడి జైన్‌ మామిడి గుజ్జు పరిశ్రమ గేట్ల ముందర పడి కాపులు కాస్తుంటే సెక్యూరిటీ గార్డులు మాయాజాలం చేస్తున్నారు. తమకు నచ్చిన వారికి సీరియల్‌ నెంబర్లు కేటాయిస్తూ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు. సీరియల్‌ నంబర్లో ఒక రైతు వెళితే కొందరు మాత్రం దర్జాగా దొంగ దారిన వెళ్లిపోతున్నారు. – వెంకటాద్రి, పద్మాపురం

Advertisement
 
Advertisement
Advertisement