పూతలపట్టు(యాదమరి): వైఎస్సార్సీపీ బలోపేతం కోసం నాయకులు చేస్తున్న కృషి ఫలిస్తోంది. శుక్రవారం మండల కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు శాంతియుత నిరసన కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ సమక్షంలో పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. వెణూతనపల్లి పంచయతీకి చెందిన టీడీపీ కార్యకర్త చంద్రశేఖర్‌ను సీనియర్ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యి పేదలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీలో చేరానని తెలిపారు.


