చిత్తూరు కలెక్టరేట్ : ఇన్ సర్వీస్ (ప్రస్తుతం విధుల్లో ఉన్న) టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని వైఎస్‌ఆర్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డిశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యా యులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల్లో నెలకొన్న టెట్ భయాన్ని పోగొట్టడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రెండు సార్లు ప్రత్యేకంగా టెట్ పరీక్షలను నిర్వహించాలన్నారు.


