కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి

Jun 6 2026 12:05 AM | Updated on Jun 6 2026 12:05 AM

తవణంపల్లె: మామిడి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లె ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. కట్టకిందపల్లెకు చెందిన వడ్డె గుర్రప్ప(55) శుక్రవారం జయచంద్ర మామిడి తోటలో మామిడి కాయలు కోస్తుండగా పక్కన కరెంటు తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో షాక్‌కు గురై చెట్టు నుంచి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం అర గొండ అపోలో హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందిన ట్లు నిర్ధారించారు. అదే సమయంలో మామిడి కాయలు కోస్తున్న రమేష్‌కు కూడా చెట్టుపై నుంచి కిందపడడంతో గాయపడ్డాడు. మృతు డి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అనుమానాస్పదస్థితిలో

వ్యక్తి మృతి

చంద్రగిరి: మంగళం క్వార్టర్స్‌ పంచాయతీ పద్మావతి నగర్‌లో టీటీడీకి చెందిన నిరుపయోగ భవన సముదాయంలో భవన నిర్మాణ కార్మికుడు శివయ్య (70) శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. నిరుపయోగంగా ఉన్న భవనంలో శివయ్య నుదుటిపై పెద్ద గాయమై విగత జీవిగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పలు ఆధారాలను సేకరించారు. మృతుడు పచ్చికాపల్లం సమీపంలోని బలసలగుంట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దశాబ్దాలుగా మంగళం ప్రాంతంలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడని, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భవన నిర్మాణ కార్మికుడు శివ య్య మృతిపై హత్య కేసు నమోదు చేసినట్లు తిరుచానూరు సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు.

జూన్‌ 10 వరకు గడువు

చిత్తూరు కలెక్టరేట్‌ : మార్చి 2026 పది పబ్లిక్‌ పరీక్షల షార్ట్‌ మెమోలలో మార్పులకు పాఠశాలల లాగిన్‌ లో ఎడిట్‌ ఆప్షన్‌ గడువును జూన్‌ 10 వరకు పొడగించినట్లు డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థుల పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ వంటి వివరాలలో ఏవైనా తప్పు లు ఉంటే, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులతో ధ్రువీకరించుకుని గడువులోగా సవరణలు పూర్తి చేయాలన్నారు. ఇత ర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ bre.ap.gov.in లో సంప్రదించాలని కోరారు.

ప్రభుత్వ భూమి

అక్రమ మార్పిడి

–విశ్రాంత వీఆర్వో పై చర్యలకు ఆదేశం

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలోని గంగవరం మండలం, గుండుగల్లు గ్రామానికి చెందిన రిటైర్డ్‌ వీఆర్వో శేషాచలపతిరావు పై శాఖ పరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ వీఆర్వో అక్రమ మ్యూటేషనులు చేయడమే కారణమని పేర్కొంది. శేషాచలపతిరావు తన పదవీ కాలంలో అక్రమాలకు పాల్పడ్డట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గుండుగల్లు గ్రామంలోని ప్రభుత్వ పోరంబోకు భూమికి (శంకరయాలపేట చెరువు భూమి) నిబంధనలకు విరుద్ధంగా మ్యూటేషన్‌ చేయడమే కాకుండా, రిజిస్ట్రేషన్‌ చట్టం 1908లోని సెక్షన్‌ 22ఏ(1) (బి) కింద నిషేధిత జాబితా నుంచి ఆ భూమిని తొలగించాలని ఆయన సిఫార్సు చేసినట్లు తేలిందన్నారు. ఈ మేరకు శాఖా పరమైన విచారణకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు.

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లకు.. దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ఇన్‌చార్జి డీఈఓ వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో పది, ఇంటర్‌ కోర్సులు పూర్తి చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారన్నారు. ఈ నెల 12వ తేదీ అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. ఆన్‌లైన్‌లో జూలై 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు డీఈవో కార్యాలయం లోని ఏపీ ఓపెన్‌ స్కూల్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

లడ్డూ నాణ్యతపై ఈవో తనిఖీ

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన లడ్డూ పోటును శుక్రవారం ఈవో పెంచలకిషోర్‌ తనిఖీ చేశారు. లడ్డూ తయారీలో వినియోగిస్తున్న పదార్థాలు, తయారీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు నాణ్యమైన, రుచికరమైన లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బంది, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. చైర్మన్‌ మణినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement