ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

Jun 6 2026 12:05 AM | Updated on Jun 6 2026 12:05 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీని శుక్రవారం కలిశారు. పలు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు శివయ్య, నాయకులు రఘురాం, నరేష్‌ బాబు, సురేంద్రనాథరెడ్డి, శైలజ, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement