ఓట్లు వేయించుకుని ముఖం చాటేశారు ప్రజలకు హామీల వెన్నుపోటు ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ జిల్లాలో విజయవంతమైన నిరసన కార్యక్రమం
వెన్నుపోటుకు రెండేళ్లు
చిత్తూరు కార్పొరేషన్: అధికారం కోసం అలవికాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక అప్పు లు చేయడం తప్ప హామీలను విస్మరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. సూపర్ సిక్స్ పథకాలు అంటూ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా వాటిని అమలు చేయలేకపోయారని ఆరోపించారు. హామీల పేరిట ప్రజలను వెన్ను పోటు పొడిచారని విమర్శించారు. హామీలు ఇవ్వ డం.. వాటిని విస్మరించడం ప్రజా ద్రోహం కాదా చంద్రబాబు అని ప్రశ్నించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట గురువారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది.
దగాకోరు చంద్రబాబు
జీడీనెల్లూరు: నియోజకవర్గంలోని కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం మండలాల్లో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అలాగే పెనుమూరు, పాలసముద్రం, జీడీనెల్లూరు, వెదురుకుప్పం మండల కేంద్రాల్లో నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దగాకోరు చంద్రబాబు అని మండిపడ్డారు.
చంద్రబాబువి 420 హామీలు
నగరి: నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా నాయకత్వంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే పుత్తూరు, విజయపురం, వడమాలపేట మండలాల్లోనూ నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబువి 420 హామీలని మండిపడ్డారు.
అబద్దాలు చెప్పడం బాబు నైజం
పూతలపట్టు: నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలంలో నియోజకవర్గ సమన్వయకర్త సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యాద మరి మండలంలో జెడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయరెడ్డి నాయకత్వంలో నిరసన తెలిపారు. అలాగే పూతలపట్టు, తవణంపల్లె, ఐరాల మండలాల్లోనూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అధికారం కోసం అబద్దాలు చెప్పడం బాబు నైజమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయం
పలమనేరు: నియోజకవర్గంలోని వి.కోటలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన తెలిపా రు. అలాగే పలమనేరు, బైరెడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మోసం చేసిన చంద్రబాబు కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.
తండ్రీకొడుకులు మోసగాళ్లు
కుప్పం: కుప్పం మున్సిపాలిటీ, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తండ్రీకొడుకులైన చంద్రబాబునా యుడు, లోకేష్ మోసగాళ్లని మండిపడ్డారు.
సూపర్ సిక్స్‌కు కత్తెర
ప్రజలకు చంద్రబాబు మోసం
చిత్తూరు: చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలంలో వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ర్యాలీ చేశారు. చంద్రబాబు హామీల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. అలాగే చిత్తూరు మండలం తాళంబేడులో నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
సంపద సృష్టి ఎక్కడ బాబూ..?
నేను ఆర్థిక సంస్కర్తను, సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు అని గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ మాటలు గాలికి వదిలేశారు. సూపర్ సిక్స్ పేరిట అనేక అబద్దపు హామీలిచ్చారు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు. అధికారం కోసం ఎన్నో హామీలిచ్చి అమలు చేయని ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టేందుకు సూపర్ సిక్స్ .. సూపర్ సక్సెస్ పేరిట సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ సంక్షేమ పథకాలు అందించారు. నేడు కూటమి ప్రభుత్వం తమ కార్యకర్తలకే పథకాలు ఇస్తోంది. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కూటమి నాయకులు ప్రకృతి సంపద తమిళనాడుకు చేరవేసి దండుకుంటున్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అధికారులు నిబంధనలకు అనుకూలంగా పనిచేయాలి. కూటమి నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారకూడదు.
– కళత్తూరు నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎం


