చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని చెస్ శిక్షణ కేంద్రంలో గురువారం అండర్ 14 క్రీడాకారులకు నిర్వహించిన జిల్లాస్థాయి చెస్ పోటీలు పోటాపోటీగా జరిగాయి. పలు ప్రాంతాల నుంచి 65 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. నలుగురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌పి ప్రసాద్ తెలిపారు. బాలుర విభాగంలో ద్వారక అర్జున్, సిద్ధార్థ్, బాలికల విభాగంలో హితశ్రీ, అనంతనిత్య ఉన్నారని పేర్కొన్నారు. వారు ఈ నెల 13, 14 తేదీల్లో గుడివాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. పోటీలు ముగిసిన అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ తహసీల్దార్, అడ్వకేట్ గోపి, స్కూల్ ఆఫ్ చెస్ చైర్మన్ దినేష్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
ఆర్‌డీఎస్‌ఎస్ పనులు
వేగవంతం చేయాలి
– ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జరుగుతున్న ఆర్‌డీఎస్‌ఎస్ పనులను వేగంగా చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు ఆదేశించారు. ఆయన గురువారం నిర్మాణ విభాగం అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడు తూ ప్రస్తుతం చేపట్టిన 11 కేవీ విద్యుత్ పనులతోపాటు ఎల్‌టీ లైన్ పనులను కూడా చేయాలన్నారు. సెప్టెంబర్‌లోపు పనులు పూర్తి చేయాలన్నారు. కుప్పంలో 3, పలమనేరులో 2, చిత్తూరులో 1, పూతలపట్టులో 2, జీడీనెల్లూరులో 2, నగరిలో 2 కలిపి మొత్తం 12 సబ్‌స్టేషన్లు రానున్నాయని వెల్లడించారు. స్థలాలను ఎంపిక చేసి త్వరలో పనులు ప్రారంభించే విధంగా చూడా లన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్ పనులు 60 శాతం పూర్తయ్యాయని, 63 బ్యాచ్‌ల ద్వారా 720 మంది పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. బ్యాచ్‌లను పెంచి పనులు వేగంగా చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఈ భాస్కర్‌నాయుడు, డీఈ మాధవ్‌రావు, రెడ్డికుమార్, ఏఈ రాజా, వసంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్లుగా ప్రమోషన్
చిత్తూరు కలెక్టరేట్: రెవెన్యూ శాఖలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తహసీల్దారు ఉద్యోగోన్నతులు సాకారమయ్యాయి. జోన్–4 పరిధిలో పనిచేస్తున్న డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూ రు జిల్లాలో 18 మందికి ఉద్యోగోన్నతులు లభించాయి. వీరిలో 15 మందిని చిత్తూరు జిల్లాకు కేటాయించగా తిరుపతికి 2, శ్రీసత్యసాయి జిల్లాకు ఒకరిని కేటాయించారు.


