వెన్నుపోటులో చంద్రబాబు దిట్ట | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటులో చంద్రబాబు దిట్ట

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

ప్రజలను ఏమార్చి గెలుపొందడానికి చంద్రబాబు ఇచ్చిన 420 మేనిఫెస్టోకు రెండేళ్లు పూర్తయింది. జగనన్నకంటే రెండింతల సంక్షేమ పథకాలు అమలుచేస్తామన్నారు. సూపర్‌ సిక్స్‌ అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక మొహం చాటేశారు. అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చారు. ఎంతమంది ఉంటే అందరికీ పథకమని చెప్పి కొర్రీలు పెట్టారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని మహిళలకు మోసం చేశారు. సంక్రాంతి కానుకలు, షాదీ తోఫాలు ఏమయ్యాయో తెలియదు. రెండేళ్లుగా ఒక్క కొత్త పెన్షన్‌ కూడా ఇవ్వలేదు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హీట్‌ అని చంద్రబాబు అంటే లోకేష్‌ తానా అని పవన్‌ తందానా అని అంటున్నారు. ఒక పాఠశాల కట్టలేదు. ఇక్కడ సంపాదించి హైదరాబాద్‌లో దాచుకుంటున్నారు. వెన్నుపోటులో చంద్రబాబు కట్టప్పను మించిపోయారు. కూటమి నేతలు పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం వల్ల ఆ శాఖ ప్రతిష్ట దెబ్బతింటోంది.

– ఆర్‌కే రోజా, మాజీ మంత్రి

Advertisement
 
Advertisement
Advertisement